9TH CLASS TELUGU CHAPTER-7 ఆడినమాట

Welcome to your 9TH CLASS TELUGU CHAPTER-7 ఆడినమాట

Full Name
Email
Phone Number
Location
1. ఆ సంఘటనకు అచ్చెరువు నొందితిని. (ప్రకృతి పదం గుర్తించండి) 
ఎ) అపూర్వం
బి) ఆచరం
సి) ఆశ్చర్యం
డి) హాచెర్యం
2. ఇచ్చోట వసింపదగదు. (గీత గీసిన పదానికి సంధి గుర్తించండ)
ఎ) ద్రుత సంధి
బి) ఆమ్రేడిత సంధి
సి) ఇత్వసంధి
డి) త్రికసంధి
3. నా సుతుడు సంగీత విద్వాంసుడు – (గీత గీసిన పదానికి సమాసం పేరు గుర్తించండి.)
ఎ) తృతీయా తత్పురుష
బి) చతుర్దీ తత్పురుష
సి) రూపక సమాసం
డి) షష్ఠీ తత్పురుష
4. గోవునకు కొడుకు మొన్న మొన్ననే పుట్టాడు…. ముద్దు ముద్దుగా ఉంటాడు. ఏడెనిమిది రోజుల వయసు కలవాడు. గడ్డి అయిననూ తినలేడు – ఈ వాక్యంలో అలంకారాన్ని గుర్తించండి. 
ఎ) అతిశయోక్తి
బి) స్వభావోక్తి
సి) ఉత్ప్రేక్ష
డి) రూపకం
5. అరణ్యంలో పుండరీకం గాండ్రించగానే చిన్న జంతువులు కకావికలమయ్యాయి. (గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి) 
ఎ) పులి
బి) సింహం
సి) ఏనుగు
డి) ఎలుగుబంటి
6. ముక్కంటి కోపానికి త్రిపురాలు భస్మమైనాయి. (ఏ సమాసమో గుర్తించండి) 
ఎ) బహువ్రీహి
బి) విశేషణ పూర్వపద కర్మధారయం
సి) ద్విగువు
డి) ద్వంద్వ
7. అడవిలో పుండరీకములున్న సరస్సు ఒడ్డున ఒక పుండరీకం జింకను వేటాడింది. (గీత గీసిన పదాలకు తగిన నానార్థపదాలు గుర్తించండి) 
ఎ) పులి, బెబ్బులి
బి) పులి, సివంగి
సి) తెల్లతామర, పులి
డి) పులి, మల్లెపూవు
8. బహుబ్లి హి సమాసానికి ఉదాహరణను గుర్తించండి. 
ఎ) చక్రధారి
బి) చతుర్ముఖుడు
సి) చరకుడు
డి) మేధ
9. నీవు బాగా పాడుతావు. (వ్యతిరేకార్థక వాక్యాన్ని గుర్తించండి) 
ఎ) నీవు బాగా పాడావు
బి) నీవు బాగా పాడవు
సి) నీవు బాగా పాడుతున్నావు
డి) నీవు బాగా పాడావా?
10. కడుపారఁజన్లుడిపి చయ్యన వచ్చెద (ఆధునిక వచనాన్ని గుర్తించండి.) 
ఎ) కడుపు నిండా పాలిచ్చి, వెంటనే వస్తాను
బి) కడుపు నిండకుండా పాలిచ్చి వెంటనే రాను
సి) కడుపు నిండా పాలిచ్చి, రేపు వస్తాను
డి) కడుపు నిండా పాలిచ్చి, సాయంత్రం వస్తాను.
11. అబద్ధపు మాటలు అనవద్దు (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి)
ఎ) సత్యమును ఎపుడూ చెప్పు
బి) అబద్ధపు మాటలంటే ఇష్టం
సి) అబద్దపు మాటలు ఆడు
డి) అబద్ధపు మాటలు ఆడవా !
12. “రవి అల్లరి చేస్తున్నాడు” (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) 
ఎ) రవి అల్లరి చేయడు
బి) రవి అల్లరి చేయలేదా?
సి) రవి అల్లరి చేయడం లేదు
డి) రవి అల్లరి చేయలేడు
13. చదువుపై శ్రద్ధ తగ్గింది. (వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి) 
ఎ) చదువుపై శ్రద్ధ తగ్గుతోంది.
బి) చదువుపై శ్రద్ధ తగ్గడం లేదు.
సి) చదువుపై శ్రద్ధ తగ్గదు.
డి) చదువుపై శ్రద్ధ తగ్గలేదు.
14. పూర్వజన్మ సుకృతంబు వల్ల ఈ భరతమాత బిడ్డనై పుటాను – గీత గీసిన పదానికి అరాన్ని గురించండి.
A) దానం
B) పుణ్యం
C) పాపం
D) దయ
15. గురువుల పట్ల అపహాస్యము తగదు- గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) భక్తి
B) గౌరవం
C) ఎగతాళి
D) మర్యాద
16. నిక్కమ్ము నిప్పు వంటిది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పాపం
B) పుణ్యం
C) భక్తి
D) నిజం
17. పాశ్చాత్య ధోరణి పై గల మోజు మన సంస్కృతిని దుర్గతి పాలు జేస్తోంది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాశనం
B) అశ్రద్ధ
C) వృద్ధి
D) సమం
18. సురభి కామధేనువు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పులి
B) గుఱ్ఱం
C) గోవు
D) గేదె
19. కష్టాలలో భీతిల్లకూడదు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) అభయం
B) భయం
C) ధైర్యం
D) పిటికి
20. సున్నిత మనస్కులు కానివారిని పాషాణ హృదయులు అనవచ్చు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) రాయి
B) రేయి
C) మట్టి
D) మొద్దు
21. ఇతరులు ఎగ్గు ఆడినన్ తిరిగి సమాధానము ఇవ్వకు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) పొగడ్త
B) ఎగతాళి
C) కోపం
D) కీడు
22. తన బిడ్డకు జరిగిన వృత్తాంతమంతా తెలిపింది – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) నాటిక
B) సంగతి
C) వ్యాసం
D) నవల
23. ఆవు పులుల సంభాషణను విన్న సురలు సంతోషించారు – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) ప్రజలు
B) పిల్లలు
C) దేవతలు
D) మునులు
24. నా బిడ్డ పూరియు మేయనేరడు – గీత గీసిన పదానికి అర్థం ఏమిటి?
A) పూరీ
B) పిండివంట
C) గడ్డి
D) పాలు
25. అడవిలో పుండరీకము మేకను ఎత్తుకుపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏట? 
A) సింహము
B) తెల్ల తామర
C) ఏనుగు
D) పెద్దపులి
26. నీవు మాట్లాడిన ప్రల్లదములు, కర్ణ కఠోరంగా ఉన్నాయి – గీత గీసిన పదానికి అర్థాన్ని గుర్తించండి.
A) తిట్టు
B) శపథము
C) కఠినపు మాట
D) శాపవాక్యం
27. వ్యాఘ్రము వస్తే వృషభము బెదిరి పారిపోయింది – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) పెద్దపులి
B) ఎద్దు
C) ఆవు
D) మేక
28. మా ఇంటిలో మొదటి నుండి మొదవులను పెంచుతాము – గీత గీసిన పదానికి అర్థం ఏది?
A) ఆవు
B) కుక్క
C) గేదె
D) కోడి
29. సరస్సులో పుండరీకములు సూర్యుని రాకతో ఉదయించాయి – గీత గీసిన పదానికి గల మరో అర్థమును గుర్తించండి.
A) తెల్లతామర
B) మల్లి
C) బంతి
D) గులాబి
30. పొట్ట కూటికోసం మనుష్యులు అనేక వేషాలు వేస్తారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఉదరం, కడుపు
B) కుక్షి, అక్కు
C) కడుపు, విడుపు
D) ఉదరం, చదరం
31. శివుని వాహనం వృషభం – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) ఎద్దు, పిల్లి
B) బసవుడు, సాంబ
C) ఎద్దు, బసవుడు
D) కోడె, పుంజు
32. కంచె చేను మేస్తే అన్నది సామెత – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నేల, భూమి
B) సస్యం, పొలం
C) పంటనేల, బంజరు
D) రాతినేల, చవుడు
33. తన దుఃఖము నరకమండ్రు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పాపలోకం, స్వర్గం
B) దుర్గతి, అశుభం
C) యమపురి, స్వర్ణపురి
D) దుర్గతి, పాపలోకం
34. హరిశ్చంద్రుడు ఎప్పుడూ అసత్వం పలుకలేదు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) అబద్ధం, నిజం
B) బొంకు, కుంకు
C) కల్ల, అబద్ధం
D) హుళక్కి, బులాకి
35. రాక్షసులు మాంసాహారులు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) పలలం, పదిలం
B) పొలసు, పిశితం
C) తరసం, విరసం
D) పిశితం, పసరు
36. స్వాతంత్ర్యం కోసం ఎందరో రక్తం చిందించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) నెత్తురు, నెతురు
B) రుధిరం, మధురం
C) నల్ల, నల్లి
D) నెత్తురు, రుధిరం
37. మా ఇంటిలోని ధేనువు హర్యానా జాతికి చెందినది – గీత గీసిన పదానికి పర్యాయపదాలేవి?
A) బఱ్ఱె, వృషభము
B) మొదవు, గోవు
C) మేక, జింక
D) గేదె, ఆవు
38. సర్కసులో పులిచే బాగా నాట్యం చేయించారు – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) సింహము, హరి
B) కరి, గజము
C) శార్దూలము, వ్యాఘ్రము
D) శరభము, శార్దూలం
39. దీనులను ఆదుకుంటే సుకృతము వస్తుంది – గీత గీసిన పదానికి పర్యాయపదాలు గుర్తించండి.
A) మంచి పని, పుణ్యము
B) న్యాయము, ధర్మము
C) పాపము, పుణ్యం
D) మోక్షం, స్వర్గము
40. ‘పాపులను తన సమీపమున బొందించునది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) భూమి
B) నరకం
C) పాతాళం
D) స్వర్గం
41. ‘లెస్సగా చేయబడినది’ – వ్యుత్పత్తి పదం గుర్తించండి.
A) పాపం
B) అబద్దం
C) సుకృతం
D) దానం
42. దేవతాదులనుద్దేశించి మూడు సార్లు కుడివైపుగా తిరగడం – వ్యుత్పత్తి పదం ఏది?
A) దేవతా వందనం
B) ప్రదక్షిణం
C) త్రిప్రదక్షిణం
D) అప్రదక్షిణం
43. వివేకహీనుడు తనకు, ఇతరులకు హాని చేస్తాడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆలోచన, అలవాటు
B) తెలివి, అలవాటు
C) బుద్ధి, తిక్క
D) ధర్మం, దయ
44. నందుని కుమారుడు శ్రీకృష్ణుడు – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) కొడుకు, బాలుడు
B) కుమారస్వామి, వినాయకుడు
C) బాలుడు, బాలిక
D) కొడుకు, పుత్రుడు
45. గోవులలో కపిల బహుక్షీర – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) ఆవు, ధేనువు
B) కన్ను, నేత్రం
C) ఆవు, బాణం
D) ఎద్దు, దున్న
46. విద్యార్థి దశ నుండి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) భాగం, ఇష్టం
B) క్షీరం, క్షారం
C) తెలుపు, తెల్లనివి
D) క్షీరం, భాగం
47. భారతదేశానికి ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి – గీత గీసిన పదానికి నానార్థాలను గుర్తించండి.
A) జవాబు, ప్రశ్న
B) లేఖ, ఒక దిక్కు
C) జాబు, జేబు
D) లేఖ, ఉత్తరం
48. సీత గుణములు చెవిసోకగానే, రాముడు శివధనుస్సుకు గుణమును బిగించాడు – గీత గీసిన పదాలకు నానార్థాలు గుర్తించండి.
A) స్వభావము, బాణము
B) గుణము, నారి
C) అమ్ము, నారి
D) విల్లు, ఈటె
49. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బిడ్డ
B) కొడుకు
C) బొట్టె
D) సుతుడు
50. గోవ్యాఘ్ర సంవాదము భోజరాజీయములోనిది – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) వేగి
B) వాగ
C) పులి
D) వాగర
51. డూడూ బసవన్న అంటూ గంగిరెద్దుల వాళ్ళు తిరుగు తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఎద్దు
B) వృషభం
C) నంది
D) ఆబోతు
52. అతని కంఠధ్వని సింహగర్జన సదృశం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) అదృశ్యం
B) ప్రత్యక్షం
C) సదసం
D) సరి
53. సత్యం కోసం హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విడిచాడు – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) నిజం
B) సూనృతం
C) సత్తు
D) ఋజు
54. దేవతలు గగన మార్గంలో ప్రయాణిస్తారు – గీత గీసిన పదానికి ప్రకృతి పదం గుర్తించండి.
A) ఆకాశం
B) గహనం
C) ఆకసం
D) గాలి
55. కులం కన్న గుణం మిన్న- గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) కొలము
B) గొల్ల
C) కాలం
D) గులాం
56. ప్రౌఢ వ్యాకరణం బహుజపల్లి వారి దివ్య గ్రంథం – గీత గీసిన పదానికి వికృతి పదం గుర్తించండి.
A) బాల
B) పౌడ
C) ప్రోడ
D) ప్రొడ
57. అ – ఇ – ఉ – ఋ లకు అవియే అచ్చులు పరమైన వాని దీర్ఘములు ఏకాదేశమగును. ఈ సూత్రంతో సరిపోవు కింది ఉదాహరణను గుర్తించండి.
A) ప్రల్లదమాడి
B) నిజావాసం
C) అత్వనురాగం
D) ధర్మవిధురాలు
58. ‘నీవు + ఎరుంగవే’ కలిపి రాయండి.
A) నీవు యెరుంగవే
B) నీవే యెరుంగవే
C) నీ వెరుంగవే
D) నీవు ఎరుంగవే
59. ‘ఈ + తనువు’ – సంధి పేరేమిటి?
A) త్రికసంధి
B) ఇత్వసంధి
C) యణాదేశసంధి
D) వృద్ధి సంధి
60. విసర్గసంధికి ఉదాహరణను గుర్తించండి.
A) ఎగ్గాడిన
B) అప్పులికిన్
C) శోభనాంగి
D) ముహుర్భాషితంబులు
61. ‘ఆ + అవసరం’ – సంధి చేయండి.
A) ఆయవసరం
B) అయ్యవసరం
C) అ అవసరం
D) ఆ అవసరం
62. ‘నిన్నుఁగని’ – విడదీయుము.
A) నిన్ను + కవి
B) నిన్నే + కని
C) నిన్నున్ + కని
D) నిన్ను + గని
63. ‘అతి + అనురాగం’ – సంధి పేరేమిటి?
A) యణాదేశ సంధి
B) యడాగమ సంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
64. తోరము + భీతి – కలిపి రాయండి.
A) తోరముభీతి
B) తోరపు భీతి
C) తోరభీతి
D) తోరముబీతి
65. ‘అప్పులి’ ఈ సంధి పదాన్ని విడదీయండి.
A) అప్పు + లి
B) అ + ప్పులి
C) ఆ + పులి
D) ఆ + ప్పులి
66. ‘ఉదరాగ్ని’ అనే పదంలో గల సంధి ఏది?
A) యణాదేశ సంధి
B) అత్వసంధి
C) గుణసంధి
D) సవర్ణదీర్ఘ సంధి
67. ‘తోరపు భీతి’లో గల సంధి ఏది?
A) రుగాగమ సంధి
B) పుంప్వాదేశ సంధి
C) యడాగమ సంధి
D) పజ్వవర్ణాదేశ సంధి
68. ఉదరాగ్ని కై ప్రాణికోటి పలు ఇబ్బందులు పడును – సమాసం పేరు గుర్తించండి.
A) చతుర్డీ
B) తృతీయా
C) రూపకం
D) షష్టి
69. ‘సత్య ప్రౌఢి’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) అనెడి
B) యొక్క
C) చేత
D) వలన
70. ‘రక్తమాంసాలు’ – సమాసం పేరేమిటి?
A) బహువ్రీహి
B) ద్వంద్వ
C) రూపకం
D) సప్తమీ
71. ‘కుల భూషణుడు’ విగ్రహవాక్యమున వచ్చు విభక్తిని గుర్తించండి.
A) చేత
B) అనెడి
C) అందు
D) యొక్క
72. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణను గుర్తించండి.
A) సత్యప్రౌఢి
B) ముద్దుల పట్టి
C) ఏడు రోజులు
D) రక్తమాంసాలు
73. ‘రత్నము వంటి ధేనువు’ – అనే విగ్రహం గల సమాస పదాన్ని గుర్తించండి.
A) రత్నధేనువు
B) ధేను రత్నము
C) ధేనూత్తమము
D) మంచి గోవు
74. ద్విగు సమాసానికి ఉదాహరణమేది?
A) త్రినయనుడు
B) ముక్కంటి
C) చతుస్సనములు
D) చతుర్ముఖుడు
75. ‘చతుర్ముఖుడు’ సమాసానికి విగ్రహవాక్యాన్ని గుర్తించండి.
A) నాల్గు ముఖాలు
B) మూడు కన్నులు గలవాడు
C) త్రినేత్రుడు
D) నాల్గు ముఖాలు కలవాడు
76. ‘ధర్మమును తెలిసిన వాడు’ – సమాసపదంగా కూర్చండి.
A) ధర్మరతుడు
B) ధర్మవిదుడు
C) ధర్మమూర్తి
D) ధర్మ ప్రభువు
77. ‘గుమ్మెడు’ గురులఘువులు గుర్తించండి.
A) UUI
B) IUU
C) UII
D) IIU
78. ‘UTU’ దీనికి సరియగు పదం గుర్తించండి.
A) పుట్టియే
B) అతండు
C) ముద్దల
D) సుతుడు
79. చంపకమాల యతిస్థానం గుర్తించండి.
A) 10
B) 11
C) 13
D) 14
80. ఉత్పలమాల గణాలు గుర్తించండి.
A) స భ ర న మ య వ
B) మ స జ స త త గ
C) న జ భ జ జ జ ర
D) భ ర న భ భ ర వ
81. ‘వినియెడు వారి కించుక వివేకము పుట్టదె యింత యేటికిన్’ పై పద్యపాదము ఏ వృత్తమునకు చెందినది?
A) ఉత్పలమాల
B) చంపకమాల
C) శార్దూలము
D) మత్తేభము
82. మత్తేభ పద్యానికి గల గణాలు ఇవి.
A) మ స జ స త త గ
B) స భ ర న మ య వ
C) భ ర న భ భ ర వ
D) న జ భ జ జ జ ర
83. ‘తెళ్ళెడు’ ఈ పదం ఈ గణానికి సంబంధించినది.
A) న గణము
B) య గణము
C) త గణము
D) భ గణము
84. ర గణానికి ఉదాహరణం ఏది?
A) పాదము
B) శ్రీరామ
C) శ్రీలక్ష్మీ
D) అమ్మణి
85. ఉపమాన, ఉపమేయములకు అభేదం చెప్పుట – ఇది ఏ అలంకారం?
A) ఉపమా
B) ఉత్ప్రేక్ష
C) రూపక
D) అతిశయోక్తి
86. “గోవు పై నీగ సోకిన గదలకుండె నెమ్మి బాషాణధేనువు నిలిపినట్లు” – ఈ పాదంలో గల అలంకారం ఏది?
A) ఉత్ప్రేక్ష
B) రూపకము
C) ఉపమ
D) స్వభావోక్తి
87. ‘జింకలు, బిత్తరి చూపులు చూస్తూ, చెవులు నిగిడ్చి, చెంగు చెంగున గెంతుతున్నాయి – ఈ వాక్యంలో గల అలంకారమేది? 
A) అతిశయోక్తి
B) స్వభావోక్తి
C) రూపకము
D) ఉపమాలంకారము
88. చెప్పెడు వారు చెప్పినన్ వినియెడువారి కించుక వివేకము పుట్టదె – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) చెప్పేవారు చెప్పినా, వినేవారికి ఏమైనా బుద్ధి ఉండదా.
B) చెప్పేవాడు చెప్పినా, వినేవాడికి కొంచెం వివేకం కలుగదా.
C) చెప్పేవాడికి, వినేవాడికి వివేకం ఉండదా.
D) చెప్పేవాడికి, లేకపోయినా వినేవాడికి బుద్ధిలేదా.
89. నెమ్మిఁ బాషాణధేనువు నిలిపినట్లు – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ఆవు నిదానంగా బొమ్మలా నిల్చుంది
B) ప్రేమతో రాతిలా నిల్చుంది
C) ప్రేమతో రాతిబొమ్మలా ఆవు నిలుచుంది
D) రాతి బొమ్మలా ఆవు నిలబడింది
90. విని వినని వాని చొప్పునఁ జనుమీ – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) విని విననట్లు నటించి వెళ్ళు
B) విని విననట్లు వెళ్ళు
C) పెడచెవిగా వెళ్ళు
D) విని కూడా వినని వాడిలా వెళ్ళిపో
91. దైవ మీ పట్టునఁ బూరి మే పెడినే? – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) దైవం ఇప్పుడు గడ్డి తినిపిస్తాడా?
B) దైవం ఈ సమయంలో గడ్డినే తినమంటాడా?
C) దైవమే ఇప్పుడు గడ్డి వేస్తాడా?
D) దైవమా గడ్డి తినాలా?
92. ‘చయ్యనఁ బోయి వచ్చెదన్’ – దీనికి ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) వెంటనే పోయివస్తా
B) శీఘ్రంగా పోయి వస్తాను
C) వేగంగా తిరిగి వెడతా
D) చయ్యన పోయిరమ్ము
93. ‘ప్రాణములింతనె పోవుచున్నవే !! – ఆధునిక వచనాన్ని గుర్తించండి.
A) ప్రాణాలు ఇప్పుడు పోవు
B) ప్రాణాలు ఇంతట్లో పోతాయా?
C) ప్రాణాలు ఈ మాత్రానికే పోతాయా?
D) ప్రాణాలిప్పుడు పోవు
94. ‘ఆవు తిరిగి వస్తానని మాట ఇచ్చింది’ – కర్మణి వాక్యం గుర్తించండి.
A) ఆవు తిరిగి వస్తానంది
B) మాట ఈయబడింది చేత ఆవు
C) ఆవుచేత తిరిగి వస్తానని మాట ఈయబడింది
D) ఆవుచేత తిరిగి రానని మాట ఈయబడింది
95. ఫులిచేత ఆవు చంపబడలేదు – కర్తరి వాక్యం గుర్తించండి.
A) ఆవు పులిని చంపలేదు
B) ఆవును పులి చంపలేదు
C) ఆవు పులి చంపలేదు
D) పులిని ఆవు చంపలేదు
96. “నేను నిన్ను నమ్మాను” అని పులి, ఆవుతో అంది – పరోక్ష కథనం గుర్తించండి.
A) తను దానిని నమ్మానని పులి, ఆవుతో అంది.
B) తన దీనినే నమ్మానని పులి, ఆవుతో అంది.
C) నేను దానిని నమ్మానని ఆవు, పులితో అంది.
D) తన నిన్ను నమ్మానని పులితో ఆవు అంది.
97. తనచే గడ్డి తినిపిస్తాడాయని పులి అంది – ప్రత్యక్ష
కథనం గుర్తించండి.
A) “నన్ను గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
B) “నాచే గడ్డి తినిపిస్తాడా?” అని పులి అంది.
C) “నాతో గడ్డి తినిపించగలడా?” అని పులి అంది.
D) “నన్ను గడ్డి తినమంటాడా?” అని పులి అంది.
98. నీ ఇంటికి నీవు వెళ్ళు – వ్యతిరేక వాక్యం గుర్తించండి. 
A) నీ ఇంటికి నీవు వెళ్ళకు
B) నీ ఇంటికి వెళ్ళకు
C) వెళ్ళకు
D) ఏదీకాదు
99. నాకు పుణ్యం ప్రసాదించు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) ప్రసాదించకు
B) పుణ్యం ప్రసాదించకు
C) నాకు పుణ్యం ప్రసాదించుకు
D) ఏదీకాదు
100. అబద్దపు మాటలు ఆడకు – వ్యతిరేక వాక్యం గుర్తించండి.
A) అబద్దం ఆడు
B) అబద్దం మాట ఆడు
C) అబద్ధపు మాటలు ఆడు
D) పైవన్నీ
101. ఆవు తన మెడ ఎత్తి, పులి దగ్గరగా వెళ్ళింది – ఇది ఏ వాక్యం?
A) సంయుక్త
B) సంక్లిష్ట
C) సామాన్య
D) మహావాక్యం
102. పులి ఆవుని నమ్మింది – ఇది ఏ వాక్యం?
A) మహావాక్యం
B) సంక్లిష్ట
C) సంయుక్త
D) సామాన్య

Leave a Comment